అగ్రి పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఈనెల 18 వరకు గడువు పొడిగింపు
2025-26 విద్యా సంవత్సరానికి ఆచార్య ఎన్. జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయంలో అగ్రి ఎమ్మెస్సీ, ఎంటెక్, ఎంబీఏ, పీహెచ్డీ, ఎంబీఏ (ఎస్ఎఫ్క్యూ) కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును ఈ నెల 18 వరకు పొడిగించారు. ఈ మేరకు వర్సిటీ రిజిస్ట్రార్ ఎం.వి. రమణ మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు సమర్పించి, హార్డ్ కాపీని ఈ నెల 22 లోపు లాంలోని వర్సిటీ పరిపాలన భవనంలో అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు గీగీగీ.బిదీవీజీబితి.బిబీ.రిదీ వెబ్సైట్ను చూడాలని చెప్పారు.

