వ్యవసాయ పట్టభద్రులకు మెగా ఉద్యోగ మేళా
వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలంగాణా రాష్ట్రంలోని వ్యవసాయ పట్టభద్రులు, పోస్టు గ్రాడ్యుయేట్లు, పీహెచ్‌డీ పొందిన వారికి ఉద్యోగావకాశాలు కల్పించేందుకు మెగా ఉద్యోగ మేళాను ఏర్పాటు చేసింది. హైదరాబాద్ రాజేంద్రనగర్‌లోని వ్యవసాయ కళాశాలలో సోమవారం ప్రారంభమైన ఉద్యోగ మేళాను ఈ నెల 26 వరకు నిర్వహించనున్నారు. తొలిరోజున వ్యవసాయ, కమ్యూనిటీ సైన్స్, వ్యవసాయ ఇంజినీరింగ్ తొమ్మిది అనుబంధ కళాశాలల నుంచి అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్, పీ.హెచ్.డీ విద్యార్థులు హాజరయ్యారు. 13 సంస్థల ప్రతినిధులు పాల్గొని మౌఖిక పరీక్షలు నిర్వహించి 140 మందిని పరిశోధన, అభివృద్ధి, మార్కెటింగ్ తదితర ఉద్యోగాలకు ఎంపిక చేశారు.


