5.64 లక్షల ఎకరాల్లో పంట నష్టం
ఇటీవల కురిసిన భారీవర్షాలు, వరదల వలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 19 జిల్లాలలో 5.64 లక్షల ఎకరాల్లో వ్యవసాయ, ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. సుమారు 3 లక్షల మంది రైతులు రూ. 1244 కోట్ల మేర నష్టపోయారు. వరదల కారణంగా 2.03 లక్షల మంది రైతులకు చెందిన 4.6 లక్షల ఎకరాల్లో వరి దెబ్బతిని రూ. 1104 కోట్ల విలువైన 4.80 లక్షల టన్నుల దాన్యం ఉత్పత్తిపై ప్రభావం పడుతుందని అధికారులు అంచనా వేశారు. నష్టపోయిన రైతులకు అదనపు సాయం చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

