నిన్న కేరళను నైరుతి రుతుపవనాలు తాకాయి. కేరళ, లక్షద్వీప్, కర్ణాటక, తమిళనాడులోని కొన్ని భాగాలు, కొమొరిన్ ప్రాంతం, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని పలు ప్రాంతాలకు ఇవి విస్తరించినట్లు భారత వాతావరణ విభాగం (ఐఎండీ) ఒక ప్రకటనలో తెలిపింది. సాధారణంగా జూన్ ఒకటో తేదీ నాటికి కేరళలోకి రుతుపవనాలు ప్రవేశించాల్సి ఉండగా మూడురోజులు ఆలస్యంగా చేరుకున్నాయి. వాతావరణం అనుకూలంగా ఉండటంతో రెండు, మూడు రోజుల్లో గోవా, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, అరేబియా సముద్రం, బంగాళాఖాతంలోని మరికొన్ని భాగాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొంత భాగానికి రుతుపవనాలు విస్తరించనున్నాయని ఐఎండీ చెప్పింది. జూన్ నుంచి సెప్టెంబరు వరకు రుతుపవనాల సీజన్లో 90 శాతం వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది. కేరళను తాకిన రుతుపవనాలు.. ఈ నెల 15 నాటికి ఆంధ్ర రాష్ట్రమంతటా విస్తరిస్తాయని విశాఖ తుపాను హెచ్ౘ్రికల కేంద్రం శాస్త్రవేత్త జగన్నాథకుమార్ తెలిపారు.