హైదరాబాద్ నెక్లెస్‌రోడ్‌లో ప్రారంభమైన నర్సరీ మేళా
తెలంగాణ ఈవెంట్ ఆర్గనైజర్ వారు నెక్లెస్ రోడ్డులో నిర్వహించిన 17వ గ్రాండ్ నర్సరీ మేళా – ఆల్ ఇండియాని తెలంగాణ రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. 30 జనవరి నుండి 3 ఫిబ్రవరి వరకు 5 రోజుల పాటు ఇది జరుగనుంది. ఈ నర్సరీ మేళాలో 150 స్టాల్స్‌లలో టెర్రస్ గార్డెనింగ్, వర్టికల్ గార్డెనింగ్ మరియు హైడ్రోపోనిక్ గార్డెనింగ్‌కు సంబంధించిన పూలమొక్కలు, ఔషధ మొక్కలు, బోన్సాయి మొక్కలు, అలంకరణ మొక్కలు మొదలైన అన్ని రకాల మొక్కలు అందుబాటులో ఉన్నాయి. మొక్కలను పెంచడానికి కావాల్సిన మెటీరియల్స్, ఆర్గానిక్ ఎరువులు, ఫెర్టిలైజర్స్, టెర్రకోట కుండీలు మొదలైనవి కూడా అందుబాటులో ఉంటాయి. ఈ మేళాలో రూ. 20 నుంచి మొదలుకొని రూ. 2.50 లక్షల వరకు విలువగల మొక్కలు అందుబాటులో ఉన్నాయని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.


