హైదరాబాద్లో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఆన్ మిల్లెట్స్ శంకుస్థాపన
కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్, కేంద్ర వ్యవసాయ మరియు రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి భగీరథ్ చౌధరి మరియు తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, హైదరాబాద్‌లోని ఐసీఏఆర్ – భారత ఇనిస్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్స్ రీసెర్చ్ (ఐసిఏఆర్-ఐఐఎంఆర్) ప్రాంగణంలో గ్లోబల్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఆన్ మిల్లెట్స్ (సీఓఈ) శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సంస్థ సిరిధాన్యాల పరిశోధన, అభివృద్ధి, శిక్షణ మరియు ప్రాచుర్యం దిశగా కీలక మైలురాయిగా నిలవనుంది. ప్రపంచవ్యాప్తంగా మిల్లెట్ల ప్రాముఖ్యతను పెంపొందించేందుకు ఇది మార్గదర్శకంగా పనిచేస్తుంది.
ఈ కార్యక్రమంలో కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వ అధికారులు, వ్యవసాయ పరిశోధకులు, శాస్త్రవేత్తలు, రైతులు మరియు ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

