హార్టీకల్చర్ డిగ్రీ కోర్సులకు 17న కౌన్సెలింగ్
ఈ నెల 17న కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం పరిధిలోని ఉద్యాన కళాశాలల్లో ఖాళీగా ఉన్న బీఎస్సీ (హార్టికల్చర్) డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ వీసీ రాజిరెడ్డి తెలిపారు. ఉదయం 10.30 నుంచి హైదరాబాద్ రాజేంద్రనగర్లోని తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయ ఎగ్జామినేషన్ సెంటర్లో కౌన్సెలింగ్ ఉంటుందని వెల్లడించారు. రాజేంద్రనగర్లోని ఉద్యాన కళాశాలలో 15 సీట్లు, వనపర్తి జిల్లా మోజెర్ల ఉద్యాన కళాశాలలో 32 సీట్లు, మహబూబాబాద్ జిల్లాలోని మల్యాల కళాశాలలో 10 సీట్లను కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తామన్నారు. మరిన్ని వివరాలకు www.skltghu.ac.in, www.pjtau.edu.in లేదా 9652456779 నంబరులో సంప్రదించవచ్చని ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

