వండని వంట… ఆరోగ్యకరమైన చాక్లెట్

కావాల్సిన పదార్థాలు

  • కోకో పౌడర్ (తీపి లేనిది) – అరకప్పు
  • తినే కొబ్బరి నూనె – అర కప్పు
  • పొడి బెల్లం – అర కప్పు
  • జీడి పప్పు పలుకులు – 1½ టేబుల్ స్పూను
  • ఎండు ద్రాక్ష పలుకులు – 1 ½ టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం: కోకో పౌడర్, బెల్లం పొడి మరియు కొబ్బరి నూనెను బ్లెండర్ లేదా మిక్సీజార్‌లో వేసి కలుపుకోవాలి. ఆ మిశ్రమానికి జీడి పప్పు మరియు ఎండు ద్రాక్ష పలుకులు వేసి, చాక్లెట్ మౌల్డ్‌లో పోసి రెండు గంటల పాటు ఫ్రిడ్ౙ్‌లో పెట్టాలి.

గమనికః కొబ్బరి నూనె వద్దు అనుకున్నవారు ఉప్పు లేని వెన్నను కరగబెట్టి వాడుకోవచ్చు. జీడిపప్పు మరియు ఎండు ద్రాక్ష బదులుగా మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్ వాడుకోవచ్చు.

రచన: విజయలక్ష్మి గిరినాథం, బెంగళూరు, కర్నాటక

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More

వండని వంట… వాము కారం

కావాల్సిన పదార్థాలు

  • వాము – ఒక టీ స్పూను (ఇసుక, మట్టి లేకుండా చూసుకోవాలి)
  • రాళ్ళ ఉప్పు – తగినంత
  • పచ్చిమిర్చి – అరకప్పు

తయారుచేయు విధానం:
వాము కారంలో పచ్చిమిర్చిఎక్కువ ఉండాలి. వాము తక్కువ ఉండాలి. ఎందుకంటే వాము ఘాటుగా ఉంటుంది కాబట్టి దీనిని తక్కువగా వేసుకోవాలి.

వాము కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోవాలి. తర్వాత మిర్చిని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని దానిలో వాము పొడిని బాగా కలిపి ఒక ప్లేట్‌లో ఈ వాము పొడిని పలుచగా పరిచి బాగా ఎండబెట్టుకోవాలి. ఏమాత్రం తేమ ఉండకూడదు. అంటే ఆ మిశ్రమం బాగా క్రిస్పీగా ఎండాలి. అప్పుడు గాజు సీసాలో పోసి నిలువ చేసుకోవాలి. స్టీలు డబ్బాలో పోయకూడదు. ఎందుకంటే ఉప్పు ఉంటుంది కాబట్టి. ఎండిన పొడిని అలాగే అన్నంలోకి, టిఫిన్స్‌లోకి వాడుకోవచ్చు. చాలా రుచిగా ఉంటుంది.

  • లతా కృష్ణమూర్తి, కుషాయిగూడ, హైదరాబాద్, తెలంగాణ

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.

Read More