కాయ నాణ్యతకు… కాల్షియం ద్రావణం
మొక్కల్లో పూత కాయగా మారే క్రమంలో కాల్షియం కీలకపాత్ర పోషిస్తుంది. దీనిని కూడా చాలా సులువుగా తయారు చేసుకునే ప్రక్రియ ఈ వ్యవసాయ విధానంలో కనిపిస్తుంది.
మనిషి ఎముక బలానికి కాల్షియం ఎంత అవసరమో, మొక్కకు అంతే అవసరం. దీనిని సహజ పద్దతుల్లో తయారు చేసుకోవడానికి సముద్రంలో, నదులలో దొరికే గవ్వలను లేదా గుడ్డు పెంకులను వెనిగర్‌తో కలిపితే ద్రవరూప కాల్షియం లభిస్తుంది. దీనిని మొక్కలకు అందించడం వల్ల ప్రధానంగా కాయ నాణ్యత, కాయ కోత తరువాత ఎక్కువ రోజుల నిల్వకు దోహదపడుతుంది.
కాల్షియంను ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్ రూపంలో కూడా అందించవచ్చు. ఒక కిలో అల్లాన్ని మెత్తగా దంచి అందులో కిలో బెల్లాన్ని కలుపుకుని పదిహేనురోజుల పాటు వుంచి మొక్కలకు పూత దశ నుంచి స్ప్రే చేయాలి.



