వ్యవసాయ పట్టభద్రుల పేర్ల ముందు డాక్టర్ పెట్టుకోవద్దు
వ్యవసాయ పట్టభద్రులను డాక్టర్లుగా పరిగ ణించలేమని, వారు తమ పేర్లకు ముందు ‘డాక్టర్’ అని పెట్టుకోకూడదని భారత వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్ -ఐకార్) స్పష్టంచేసింది. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మానవ, పశు వైద్య కోర్సుల్లో పట్టభద్రులైన వారు మాత్రమే ‘డాక్టర్’ అని పెట్టుకోవడానికి అర్హులంది. వ్యవసాయంలో పంటలు, మొక్కల రక్షణ, చీడపీడల నివారణ, విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల నాణ్యతలపై అధ్యయనం చేసి పట్టభద్రుడినైన తాను వైద్యుడినేనని భావిస్తున్నానని, తన పేరుకు ముందు డాక్టర్ అని పెట్టుకోవడానికి అనుమతించాలని కోరుతూ తమిళనాడుకు చెందిన వ్యవసాయ పట్టభద్రుడు కె.శ్రీరామ్ ఇటీవల ఐకార్‌కు లేఖ రాశారు. దాన్ని ఐకార్ పరిశీలించి, కేంద్ర ప్రభుత్వం నుంచి సమాచారం తీసుకుంది. అనంతరం ఐకార్ అదనపు డైరెక్టర్ జనరల్ ఏఎస్ యాదవ్… వ్యవసాయ పట్టభద్రుడు శ్రీరామ్‌కు ప్రత్యుత్తరమిస్తూ పైవివరాలను వెల్లడించారు.

