ఔషధ మొక్క… కదంబం

కదంబం మధ్యస్థం నుండి పెద్దగా పెరిగే ఆకురాల్చే వృక్షం. దీని మాను స్థూపాకారంలో ఉంటుంది. శాఖలు సమాంతరంగా ఉండి శిఖర భాగం గుండ్రంగా ఉంటుంది. బెరడు చిక్కటి గోధుమ రంగులో ఉండి నిలువుగా పగుళ్ళు కలిగి పొలుసులుగా ఊడిపోతుంది. ఆకులు అండాకారం లేదా దీర్ఘ అండాకారంలో ఉండి ఎదురెదురుగా ఏర్పడతాయి. ఆకుల అడుగు భాగంలో నూగు ఉంటుంది. పూలు సువాసన కలిగి పసుపు లేదా నారింజ రంగులో గుండ్రంగా ఉంటాయి. కాయలు గుండ్రంగా ఉండి పండితే పసుపు రంగులోకి మారతాయి.

సాధారణ నామం : వైల్డ్ సింఖోన / రుద్రాక్షాంబ శాస్త్రీయ నామం : ఆంతోసిఫాలస్ కైనెన్సిస్, ఆంతోసిఫాలిస్ కదంబం కుటుంబం: రూబియేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • కదంబం బెరడు, ఆకులు, పండ్లు ఔషధగుణములు కలిగి ఉంటాయి. వాటిలో కాడంబైన్, ఆకడమైన్, బీటాసైటోస్టిరాల్ మొదలగు ఆల్కలాయిడ్లు మరియు కాదంబజెనిక్ ఆమ్లం ఉంటాయి.
  • కదంబం బెరడు టానిక్‌లా పనిచేస్తుంది. జ్వరాలను తగ్గిస్తుంది.
  • ఆకుల కషాయం పుండ్లు, గాయాలు మొదలైన వాటిని తగ్గిస్తుంది. పండ్లు కడుపులో వికారం మరియు జ్వరాలను తగ్గిస్తాయి.

వ్యవసాయరంగంలో…

  • కదంబం ఆకుల పెట్రోలియం ఈథర్, క్లోరోఫాం, అసిటోన్ ద్రావణాలు ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసా, సాల్మొనెల్లా టైఫా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, కాన్డిడా ఆల్బికాన్స్‌పై యాంటీ బాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (చంద్రశేఖర్ అండ్ ప్రసన్న, 2009).
  • కదంబం క్లోరోఫాం ఫ్రాక్షన్ షిగెల్లా డిసెంటెరిమే, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గరిష్ట యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించింది. ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ నైగర్, క్యాండిడా ఆల్బికాన్స్‌పై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించింది (రఫ్షాంజని, ఆమె అనుచరులు, 2014).
  • కదంబం కాయలు మరియు పండ్లు ఆల్కహాలిక్ మరియు నీటి ద్రావణాలు స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, సూడోమోనాస్ ఈరూజినోసాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి.
  • కదంబం మిథనాల్ ఆకుద్రావణం మరియు బయోసింథసిస్ చేసిన నిమ్మగడ్డి గోల్డ్ నానోపార్టికల్స్ క్యూలెక్స్ క్వింక్వెఫాసియేటస్ మొదటిదశ లార్వాలు ప్యూపాలు, పెద్దపురుగుల జీవితకాలాన్ని పెంచాయి. ఈ మొక్కలో ఉన్న చురుకైన రసాయనాలు లార్వా, ప్యూపా, పెద్ద పురుగుల విడుదలను గణనీయంగా అరికట్టాయి. (జయలలిత, ఆమె అనుచరులు, 2016)

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

ఔషధ మొక్క… ఏడాకుల పొన్న

ఏడాకుల పొన్న 4-10 మీ. ఎత్తు వరకు పెరిగే వృక్షం. ప్రతి కణుపు నుండి 4-7 ఆకులు వస్తాయి. ఆకులు దాదాపు 9-12 x 2.5-3 సెం.మీ. పరిమాణంతో కోలగా ఉన్న దీర్ఘచతురస్రాకారంలో గాని, బళ్ళెం ఆకారంలో గాని ఉంటాయి. ఈనెలు దగ్గర దగ్గరగా ఉంటాయి. ఆకుల అడుగు భాగం పాలిపోయి ఉంటుంది. పూలు తెల్లగా ఉండి కొమ్మల చివర్లలో వస్తాయి. గింజలు ఒంటరిగా లేదా జతగా ఉంటాయి.

సాధారణ నామం : డెవిల్స్‌ట్రీ, సప్తపర్ణి శాస్త్రీయ నామం : ఆల్‌స్టోనియా స్కాలారిస్ / ఆల్‌స్టోనియా బూనీ కుటుంబం: అపోసైనేసి

ఉపయోగాలు : ఔషధరంగంలో …

  • పండ్లు మరియు చెట్టు బెరడుకు ఔషధగుణాలున్నాయి.
  • దీనిలో ఎఖిటమైన్, వినోటర్పిన్, గ్లూకోసైడ్, డిటేమిన్, ఎఖిటోనైన్, ఎఖిటైన్ అనే రసాయనాలు ఉంటాయి.
  • బాగా పండిన పండ్లు సిఫిలిస్, మూర్ఛ, పిచ్చి మొదలగు వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయి.
  • బెరడు కషాయం జ్వరం, శ్వాసకోశవ్యాధులు, కుష్టు మరియు పుండ్లను నివారిస్తుంది.

వ్యవసాయరంగంలో

  • ఆల్‌స్టోనియా బూనీ ఆకు మరియు కొమ్మ ద్రావణం గులాబి రంగు కాండం తొలుచు పురుగు, సెసేమియా కలామిస్టిస్ పెరుగుదల నిరోధకంగా పనిచేస్తాయి.
  • ఏడాకుల పొన్న పెట్ ఈథర్ ద్రావణం షిగెల్లా బాయ్‌డీ, విబ్రియో పారాహెమోలైటికస్‌పై కొద్దిపాటి నిరోధక చర్యను ప్రదర్శించింది. కార్బన్ టెట్రాక్లోరైడ్ ద్రావణం విబ్రియో మిమికస్, విబ్రియో పారాహెమోలైటికస్‌లపై బలమైన నిరోధక చర్యను ప్రదర్శించింది. క్లోరోఫాం ద్రావణాలు విబ్రియో పారాహెమోలైటికస్ పెరుగుదలను బలంగా అరికట్టింది. ఎస్కెరిచియా కోలిపై కూడా నిరోధక చర్యను ప్రదర్శించాయి (బెల్లా, అతని అనుచరులు, 2017).
  • ఈ చెట్లు కాండం బెరడు ద్రావణం నత్త, లిమ్నేయియా అక్యూమినేటపై బలమైన మొల్లస్కసైడల్ చర్యను ప్రదర్శించింది (సింగ్ అండ్ సింగ్, 2003).
  • ఈ మొక్క ద్రావణం దోమల లార్వాలపై కీటకనాశక చర్యను ప్రదర్శించింది. (జిజి, అతని అనుచరులు, 2012).
  • ఏడాకుల పొన్న కాండం బెరడు పెట్రోలియం ద్రావణం లిమ్నేయీ అక్యూమినేట, ఇండోప్లానోర్బిస్ ఎక్ౙస్టస్ అను నత్తలపై అధిక విషప్రభావం చూపింది (చౌహాన్ అండ్ సింగ్, 2014).
  • ఏడాకుల పొన్న మిథనాల్, నీటి ద్రావణాలలో ఉన్న అత్యధిక ఫైటోకెమికల్ సముదాయాలు అత్యుత్తమ యాంటీబాక్టీరియల్ చర్యలను ప్రదర్శించాయి (షకీల్, అతని అనుచరులు, 2014).

రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి

Read More

పర్యావరణ మార్పులను తట్టుకోవడంలో ఉద్యాన పంటలసాగు దోహదపడుతుంది

ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ దండా రాజిరెడ్డి

పర్యావరణ మార్పులను అదుపులో ఉంచడానికి ఉద్యాన పంటలను విరివిగా పెంచాలని ఆచార్య కొండా లక్ష్మణ్‌ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వీసీ డాక్టర్‌ దండా రాజిరెడ్డి అన్నారు. పర్యావరణ మార్పులు, పంటలు సంబంధిత అంశాలపై లోతైన పరిశోధన చేసేందుకుగాను ప్రత్యేక పరిశోధన స్థానం ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలిపారు. వనపర్తి జిల్లా మోజెర్లలోని ఉద్యాన కళాశాలలో పర్యటించాక మదనాపురంలోని విద్యార్థుల ఉద్యాన బోధనా క్షేత్రాన్ని పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. పండ్లతోటల సాగుతో పాటు అంతర పంటలు సాగు చేయాలని, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకుంటే వర్షాభావ పరిస్థితుల్లో తోటలకు నీటిని అందించవచ్చన్నారు. తక్కువ నీటితో బాగా దిగుబడినిచ్చే ఉద్యాన పంటలైన ఉసిరి, చింత, నేరేడు, సపోటా, వాక్కాయ, కుంకుడు, దానిమ్మ, సీతాఫలం, మునగ లాంటి వాటిపై దృష్టి సారించాలని అన్నారు. తక్కువ కాలంలో కోతకొచ్చే కూరగాయలు, ఆకుకూరలు, ఏక వార్షిక రకాలు, ప్రాంతానికి అనువైన ఔషధ మొక్కలను సాగుచేయాలని తెలిపారు.

Read More

స్థానిక జాతి మొక్కలు, చెట్లనే పెంచుదాం

మొక్కలు నాటడమంటే తంతు కాదు.. అదో యజ్ఞం. సరైన చోట సరైన వృక్షజాతులను పెంచితేనే మంచి ఫలితాలొస్తాయి. కానీ చాలాచోట్ల పచ్చదనం పేరుతో ఏవేవో రకాలను పెంచుతున్నారు. అవి ఫలించి, పుష్పించి, పచ్చగా కనిపించినా పర్యావరణానికి మాత్రం చేటు చేస్తున్నాయి. మనవైన మొక్కలతోనే ఈ ఉపద్రవాన్ని అరికట్టగలుగుతాం. గతంలో మనం చూసిన చాలా పకక్షులు, ఉడతల వంటి జీవులు. ఇప్పుడు కనిపించట్లేదు. అందమైన సీతాకోకచిలుకలూ కనుమరుగైపోతున్నాయి. దేశీయ మొక్కలు, చెట్లు లేకపోవడం వీటన్నిటికీ కారణం. పట్టణాలు విస్తరిస్తున్నకొద్దీ పచ్చదనం మాయమవుతోంది. పచ్చదనం పెంచాలన్న లక్ష్యంతో వేల మొక్కలు నాటుతున్నా వాటిలో ఎక్కువ స్థానికేతర జాతులే ఉంటున్నాయి. దేశవాళీ వృక్ష సంపద తగ్గిపోయే కొద్దీ జీవ వైవిధ్యంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అంతేకాదు భూగర్భ జలాలు, వర్షపాతం, ఉష్ణోగ్రతలపైనా ఈ ప్రభావం పడుతోందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.*వలసపోతున్న పక్షులు*స్థానిక వృక్ష జాతుల వల్ల చాలా ప్రయోజనాలున్నాయి. ఇవి మన నేలలకు అలవాటు పడ్డ రకాలు. వీటిపైనే పకక్షులు ఎక్కువగా వాలతాయి. గూళ్ళు కట్టుకుంటాయి. మన వృక్షాలు లేకపోవడం వల్ల చాలా పకక్షులు వలసపోతున్నాయి. పకక్షులకు సహజ ఆవాసాలుగా మారే తుమ్మ వంటి చెట్లు లేకపోవడంతో చిలుకలు, మైనా వంటివి తగ్గిపోయాయి. తాటి, ఈత చెట్లు, వడ్రంగి పిట్టలు, పాలపిట్టలకు సహజసిద్ధ అవాసాలు. ఉమ్మడి రాష్ట్ర పక్షిగా గుర్తించిన పాలపిట్ట ఇపుడు అంతరించిపోయే పరిస్థితి ఉంది.సీతాకోక చిలుకలు తేనెటీగలను దేశీజాతి ఫల, పుష్పాలు ఆకర్షిస్తాయి. ఆ చెట్ల సంఖ్య తగ్గేకొద్దీ అవి కనుమరుగవుతాయి. పిచ్చుకల్లో చాలా రకాలు ఉండేవి. ఇప్పుడు ఇందులో కేవలం ఒకటి మాత్రమే కనిపిస్తోంది.*గాలి నాణ్యతకు దోహదం*వేప, మద్ది, రావి, మర్రి, వంటివి క్షామాన్ని తుపాన్లను కూడా తట్టుకుని నిలబడతాయి. ఎక్కువ ప్రాణవాయువును విడుదల చేస్తాయి. నగరాల్లో వాయు కాలుష్యం పరిమితికి మించి పెరిగింది. గాలిలోని ధూళి కణాలను శుద్ధి చేయడంలో ఈ చెట్లు బాగా పనికివస్తాయి. ఈ రకం చెట్లు పడిన వాననీటిని భూగర్భంలో ఇంకేలా చేస్తాయి. వీటి వల్ల భూగర్భ నీటి మట్టం పెరుగుతుంది. మేఘాలను ఆకర్షించి వర్షం కురిసేలా. చేయడంలోనూ అవి చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయి.*మన పెరట్లో…*బయటే కాకుండా మన ఇళ్లల్లోని పెరట్లో కూడా స్థానిక జాతి మొక్కలు, చెట్లను పెంచుదాం. దీంతో జీవావరణం వృద్ధి చెందుతుంది. జీవవైవిధ్యానికి కూడా మేలు చేసిన వారమవుతాం.కరివేపాకు, జామ, సీతాఫలం, బొప్పాయి, వాటర్‌ యాపిల్‌, స్టార్‌ ఫ్రూట్‌ వంటి పండ్ల రకాలను నాటొచ్చు. రూఫ్‌టాప్‌పై సోర, బీర, టమోటా, వంగ, వంటి వాటిని పెంచితే మంచిది. మల్లె, సన్నజాజి, జాజి, బంతి, తదితర దేశీయ పూల మొక్కలను పెంచొచ్చు.*శేషాచలంపైనా….*శేషాచలం కొండల్లో 80వ థకంలో అటవీ ప్రాంత విస్తరణ కోసం పెద్దఎత్తున ఆకాసియా ఔరిక్యలిఫార్మిస్‌ అనే ఆస్ట్రేలియన్‌ మొక్కలను భారీగా నాటారు. ఇవి నేలలో క్షార గుణాన్ని పెంచి, స్థానిక మొక్కలను బతకనీయకుండా చేస్తున్నాయి. లాంటానా కామారా అన్న స్థానికేతర జాతి చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవులు, పచ్చిక బయళ్లను ఆక్రమించాయి. వీటిపై పకక్షులు గూళ్ళు కట్టి, ఆహారం సేకరించే అవకాశాలు ఉండడం లేదు. పూలు, ఫలాలు లేకపోవడం వల్ల తేనెటీగలు.. సన్‌బర్డ్‌, బుల్‌బుల్‌ వంటి పుప్పొడి రవాణా చేసే పకక్షులు గణనీయంగా తగ్గిపోయాయి. *ఏవి దేశీయ జాతులు?:* మర్రి, రావి, మేడి, వేప, మారేడు, వెలగ, గానుగ, తుమ్మ, మునగ, ఇప్ప, జువ్వి గంగరావి, నేరేడు, ఉసిరి, కుంకుడు, కొబ్బరి, తాటి, మద్ది, తదితర రకాలు*ఇవి స్థానికేతర రకాలు :* బూరుగు, కోనోకార్పస్‌, జామాయిల్‌, మలేషియా వేప, మహాగని, పుమేరియా, బాటిల్‌ బ్రష్‌. *కాపాడాల్సిన బాధ్యత మనదే..*పార్కుల్లో అందం కోసం, లెక్క కోసం స్థానికేతర స్థానిక రకాలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రహదారుల విస్తరణలో చింత చెట్లను విచ్చలవిడిగా కొట్టేస్తున్నారు. వీటిని విస్తారంగా పెంచితే పేదలు ఆర్థికంగా నిలదొక్కుకునేందుకూ ఆసరాగా ఉపయోగపడతాయి.- *ప్రొ.తుమ్మల శ్రీకుమార్‌,* పర్యావరణవేత్త, విజయవాడ

Read More