చెదిరిన రైతు కుటుంబాల పిల్లలకు విద్యాదానం చేస్తున్న సాయి సంస్థాన్
రైతులు అప్పులు, పంటనష్టాల వంటి కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడితే.. వారి పిల్లల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. చాలామంది చదువును మధ్యలోనే ఆపినేసి, కుటుంబ బాధ్యతలు మోయాల్సి వస్తోంది. ఇలాంటి రైతు కుటుంబాలకు అండగా మహారాష్ట్రలోని శిర్డీ సాయి బాబా సంస్థాన్ ట్రస్టు ఓ ముందడుగు వేసింది. చదువులో ప్రతిభ కనబరిచే బాధిత కుటుంబాల విద్యార్థులకు ఉచిత విద్య, వసతి, భోజన సౌకర్యాలను అందించేందుకు ప్రత్యేక కార్యక్రమాన్నిప్రారంభించింది. 10వ తరగతి పరీక్షలో 80 శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాదించిన విద్యార్థులకు స్థానిక విద్యాప్రాంగణంలో 11, 12 తరగతులకు పూర్తి ఉచితవిద్యను అందిస్తున్నారు. ఈ పిల్లలకు ఇంజినీరింగు, వైద్యవిద్యకు అవసరమైన ప్రవేశ పరీక్షల శిక్షణ ఫీజులను సైతం సంస్థే చెల్లిస్తుంది.


