కేంద్ర ప్రభుత్వం అమెరికా ఒత్తిడికి తలొగ్గి పత్తి దిగుమతులపై 11% సుంకాన్ని ఎత్తివేయడం వల్ల మనదేశంలోని రైతులకు తీవ్రనష్టం వాటిల్లుతుందని మంగళవారం సచివాలయంలో పత్తి దిగుమతి సుంకం తగ్గింపు, యూరియాపై సమీక్ష నిర్వహించిన సమీక్షా సమావేశంలో తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఇప్పటికే పామాయిల్‌పై దిగుమతి సుంకాన్ని తగ్గించడం ఆ పంట సాగుపై తీవ్ర ప్రభావం చూపిందని, సుంకాలను పెంచి రైతులను రక్షించాలని కేంద్రాన్ని కోరుతుంటే.. ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం దారుణమని విమర్శించారు. ఇందుకోసం అవసరమైతే దేశవ్యాప్తంగా రైతు సంఘాలతో కలసి ఉద్యమం చేపడతామన్నారు.