కూరగాయల సాగులో కేరళ విధానం అమలు చేయాలి: కోదండరెడ్డి
కూరగాయల సాగు, మార్కెటింగ్‌లో కేరళ విధానం ఆదర్శంగా ఉందని, దానిని తెలంగాణలోనూ అమలు చేయాలని రాష్ట్ర వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఛైర్మన్ కోదండరెడ్డి సూచించారు. కూరగాయల సాగుపై సోమవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ”రాష్ట్రంలో కూరగాయలు సాగు చేసే రైతులు అమ్ముకోడానికి ఇబ్బంది పడుతున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో నిత్యం కూరగాయలను దిగుమతి చేసుకుంటున్నారు. ఇటీవల కేరళలో పర్యటించి అక్కడి విధానాన్ని అధ్యయనం చేశాం. ఆ మాదిరిగానే రాష్ట్రంలో కూరగాయల సాగు విస్తీర్ణం పెరగాలి. మధ్య దళారీ వ్యవస్థను నివారించాలి. రాష్ట్ర వ్యవసాయ రంగంలో సంస్కరణలు రావాలి. దీనిపై నెలరోజుల్లో నిర్దిష్టమైన ఆలోచన చేసి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తాం’ అని కోదండరెడ్డి పేర్కొన్నారు.


