ఔషధ మొక్క… చెంగల్వ కోస్టు
సాధారణ నామం: ఎలిగెంట్ కాస్టన్, కేవుకంద, బోగచ్చిక దుంప, బేసికదుంప
శాస్త్రీయ నామం: కోస్టస్ స్పీసియోసస్
కుటుంబం: జింజిబెరేసి
ఇది అల్లం దుంప వంటి వేరుగల మొక్క. దుంప అల్లం కంటే పెద్దగా ఉంటుంది. కొమ్మలు సాధారణంగా వర్తులాకారపు వంపు కలిగి 1-2 మీ. ఎత్తు పెరుగుతాయి. కణుపుకు ఒకటి చొప్పున సామాన్య పత్రాలు దీర్ఘచతురస్రాకారములో ఉండి మెత్తని నూగు కలిగి ఉంటాయి. పుష్పాలు తెల్లగా, పెద్దవిగా కొమ్మచివర దట్టమైన గుత్తివలె ఏర్పడతాయి. రక్షక పత్రాలు ఎర్రగా ఆకర్షణీయంగా ఉంటాయి. ఫలాలు కూడా ఎర్రగా ఉంటాయి. దీనిని దుంపల ద్వారా వ్యాప్తి చేయవచ్చు.

ఉపయోగాలు : ఔషధరంగంలో …
- దుంపలకు లేదా కొమ్ములకు ఔషధ గుణాలున్నాయి. ఈ దుంపల నుండి డయోస్ జెనిన్ అనే స్టిరాయిడ్ లభిస్తుంది.
- విరేచనకారి, క్రిమిసంహారి, జీర్ణశక్తిని అభివృద్ది చేస్తుంది. జ్వరము, చర్మవ్యాధులు, ఉబ్బు కామెర్లకు ఉపయోగపడుతుంది. పాము కాటుకు విరుగుడుగా ఉపయోగిస్తారు. గర్భనిరోధక మందుల తయారీలో డయోస్‌జెనిన్ స్టిరాయిడ్ ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో
- చెంగల్వకోస్టుని విస్తృతంగా అలంకరణ మొక్కగా పెంచుతారు. చెంగల్వకోస్టు ద్రావణాలు (2500, 5000, 10000, 20000 పిపియం) ప్లూటెల్లా క్లైలోస్టెల్లా లార్వాలపై గణనీయమైన నివారణ చర్య చూపాయి. ఇథనాల్ ద్రావణం అత్యంత సమర్ధవంతంగా ప్లూటెల్లా క్ౙెåలోస్టెల్లా లార్వాలను నివారించింది. లార్వాలపై ద్రావణాల ప్రభావం ఈ క్రింది క్రమంలో ఉంది.
- ఇథనాల్ & క్లోరోఫాం & బ్యూటనాల్ & నీరు (అశిష్ కుమార్, అతని అనుచరులు, 2016).
- చెంగల్వకోస్టు ద్రావణం షిగెల్లా, స్టెఫైలోకోకస్ ఆరియస్, ఎస్కెరిచియా కోలి, క్లెబ్సియెల్లా న్యుమోనియే, సూడోమోనాస్, బాసిల్లస్ సబ్‌టైలిస్, సాల్మొనెల్లాపై గణనీయమైన యాంటిబాక్టీరియల్ చర్యను ప్రదర్శించాయి. చెంగల్వకోస్టు ద్రావణం నుండి వేరు చేసిన అవినోకోసైడఎ, ట్రెగోజెనిన్, సపోనిన్‌బి, సపోనిన్‌సి, బోట్రైటిస్ సినరియా, ఆల్టర్నేరియా టెన్యుస్సిమా, ఫ్యుజేరియంపై యాంటిఫంగల్ చర్యను ప్రదర్శించాయి (సింగ్, అతని అనుచరులు, 1992).
- చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్ౘ్ల ఎర్రనల్లి, టెట్రానైకస్ అర్టికె ఆడపురుగుల పునరుత్పత్తిని, పొదిగిన గుడ్ల శాతాన్ని, గుడ్లు పెద్ద పురుగుల దశకు చేరే శాతాన్ని, జీవిత చక్రంలో ప్రతిదశ సమయాన్ని సమర్ధవంతంగా అరికట్టింది. ఈ ద్రావణం 79.67% లార్వాలను అకారిసైడల్ చర్య ద్వారా చంపింది. గుడ్లు పొదిగే సమయాన్ని బాగా పెంచింది (ఇస్మాయిల్, 2017).
- చెంగల్వ కోస్టు (కోస్టస్ స్పీసియోసా), కోస్టస్ లాసెరస్, కోస్టస్ గ్లోబోసస్ దుంపల నుండి వేరు చేసిన డయోస్‌జెనిన్ ప్లూటెల్లా క్లైలోస్టెల్లాపై తక్కువ స్పర్శ, ఓవిసైడల్ చర్యను ప్రదర్శించింది. కాని అధిక శక్తివంతమైన కీటకపెరుగుదల క్రమబద్ధీకరణ చర్య, అధిక గుడ్లు పెట్టకుండా నిరోధించే చర్యను ప్రదర్శించింది. లార్వా, ప్యూపాల రూపాలలో కూడా మార్పు తెచ్చింది. కాని ప్లూటెల్లా క్లైలోస్టెల్లా నాశించే పారసైటాయిడ్, కొటీసియా ప్లూటెల్లాకు ఎలాంటి హాని చేయలేదు (పిపిత్‌సంగ్‌చన్ అండ్ మొరాల్లోరెజెసస్, 2005).
- చెంగల్వకోస్టు వేరు ద్రావణం డెంగ్యూ మరియు యెల్లో ఫీవర్ వాహకం ఈడెస్ ఈజిప్టిపై గణనీయమైన లార్విసైడల్ చర్యను ప్రదర్శించింది. అందువలన దీనిని డెంగ్యు మరియు యెల్లోఫీవర్ నివారణలో ఉపయోగించవచ్చు (అడెబాజొ, అతని అనుచరులు, 2012).
- చెంగల్వకోస్టు దుంపను నలగ్గొట్టి పేస్టు చేసి దాని నుండి రసం పిండాలి. ఈ రసాన్ని నీటిలో కలిపి వరి చేలో పంటపై పిచికారి చేసి రైస్‌హిస్పా (తాటాకు తెగులు)ని నివారించవచ్చు. ఈ పద్ధతిని అస్సామ్‌లో కామ్‌రూప్ జిల్లాలోని అమ్‌టోలా గ్రామ రైతులు ఆచరిస్తున్నారు (హరేన్‌కల్టియా, 2003).
- చెంగల్వకోస్టు ద్రావణం రెండు మచ్చల ఎర్రనల్లి టెట్రానైకస్ అర్టికెని అకారిసైడల్ చర్య ద్వారా నియంత్రించింది (ఇస్మాయిల్).
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి.
















