రేపటి నుండి సిసిఐ ద్వారా పత్తి కొనుగోళ్లు
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సచివాలయంలో నిర్వహించిన ”రైతు నేస్తం” కార్యక్రమంలో పాల్గొని, ఈ యాసంగి సీజన్లో ఎన్ఎఫ్ఎస్ఎన్ఎం మరియు ఎన్ఎంఇఓ పథకాల ద్వారా 50% రాయితీతో ఇవ్వనున్న శనగ, ప్రొద్దుతిరుగుడు మరియు కుసుమ పంటల విత్తనాలను రైతులకు అందజేసారు. రేపటి నుండి సీసీఐ ద్వారా పత్తి కొనుగోళ్లు ప్రారంభిస్తున్నట్లు తెలియచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ అన్వేష్ రెడ్డి మరియు రైతునేస్తం వేంకటేశ్వరరావు, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, రైతులు పాల్గొన్నారు.

