వ్యవసాయ శ్రామికుల కోసం, రైతాంగం కోసం ఎన్.జి. రంగా గారు చేసిన కృషి మరువలేనిది
అచ్చెంనాయుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు
వ్యవసాయ శ్రామికుల కోసం, రైతాంగం కోసం ఎన్.జి. రంగా గారు చేసిన కృషి మరువలేనిదని ఎన్జీ రంగా 124వ జయంతి సందర్భంగా రంగా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం, లాంలో జరిగిన జయంతి సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెం నాయుడు అన్నారు. రైతుల కోసం పార్లమెంటులో వారు చేసిన ప్రసంగాలు, వారు చేసిన సంస్కరణలు మాకు ఆదర్శమన్నారు. అక్కడ పొలంలో డ్రోన్ ద్వారా మందులను పిచికారీ చేసే పద్ధతులను స్వయంగా చూసి అధికారులను అభినందించడం జరిగింది.. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నామని, భవిష్యత్తులో రైతులంతా ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని సూచించారు. నర్సరావుపేట పార్లమెంటు సభ్యులు లావు కృష్ణ దేవరాయలు మాట్లాడుతూ రైతుల సాగు ఖర్చులు, పిచికారీ ఖర్చులు, విత్తనాల ఖర్చులు, పెట్టుబడి ఖర్చులు సగం తగ్గేటట్లు శాస్త్రవేత్తలు కృషి చేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రైతు నాయకులు యలమంచిలి శివాజీ, ప్రత్తిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు, పద్మశ్రీ అవార్డు గ్రహీత, రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వేంకటేశ్వర రావు, ఎన్జీ రంగా ఫౌండేషన్ కిషోర్, యూనివర్సిటీ వైస్-ఛాన్సలర్ డాక్టర్ శారదా జయలక్ష్మి దేవి, డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్ డాక్టర్ పాలడుగు సత్యనారాయణ, రైతు నెక్కంటి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.





