మొంథా’ తుపాను ప్రభావంతో వర్షాలు
ఆగ్నేయ బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగు తోంది. అది ఆదివారం సాయంత్రానికి పోర్టుబ్లెయిర్‌కు 670 కిలోమీటర్లు, చెన్నైకు 720, కాకినాడకు 780, విశాఖపట్నానికి 790, గోపాలపూర్ (ఒడిశా)కు 900 కి. మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. మంగళవారం ఉదయానికి తీవ్ర తుపానుగా మారి, అదే రోజు రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటుతుందని అంచనా వేసింది. మంగళవారం దాదాపు 12 గంటల పాటు దాని తీవ్రత కొనసాగి, తర్వాత బలహీనపడొచ్చని పేర్కొంది. దీని ప్రభావంతో రాబోయే నాలుగు రోజుల్లో ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మంగళ, బుధవారాల్లో గరిష్ఠంగా గంటకు 110 కి.మీ. వేగంతో ప్రచండ గాలులు వీయొచ్చని చెప్పింది.

