మన బియ్యానికి విదేశాల్లోనూ డిమాండ్ ఉంది
తెలంగాణా రాష్ట్రంలో పండించే బియ్యానికి డిమాండ్ పెరుగుతుందని…. మన దేశంలోని బీహార్, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలతో పాటు రెండు, మూడు దేశాలు మన తెలంగాణా రైతులు పండించే బియ్యాన్ని దిగుమతి చేసుకునేందుకు ఆసక్తి చూపుతున్నాయని పౌరసరఫరాల శాఖామంత్రి ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు. మంత్రులు ఉత్తమకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావులు రాష్ట్రంలోని ప్రజాప్రతినిధులతో మంగళవారం హైదరాబాదు నుంచి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఉత్తమకుమార్ రెడ్డి ఈ విషయాన్ని చెప్పారు. ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్‌తో పాటు ఎం.పీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కమీషనర్ డీ.ఎస్. చౌహాన్ పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు సాఫీగా సాగేలా ప్రజాప్రతినిధులు చూడాలి. రాష్ట్ర ప్రభుత్వానికి అప్రతిష్ట రాకుండా చూడాలి. అధికారులు అప్రమత్తంగా ఉండాలి అని ఉత్తమకుమార్ రెడ్డి అన్నారు

