మన దేశం సుగంధ ద్రవ్యాల సాగులో అగ్రగామిగా నిలవనుంది
స్పైసెస్ బోర్డుకు రూ.156.89 కోట్లు ఈసారి కేంద్ర బడ్ౙెట్‌లో కేటాయించారని, నిజామాబాద్‌లోని పసుపు బోర్డు కూడా దీని కిందకే వస్తుందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి శుక్రవారం ‘ఎక్స్ ’ ఖాతాలో పేర్కొన్నారు. సుగంధ ద్రవ్యాల (స్పైసెస్) సాగుకు దండిగా నిధులు కేటాయించడంతో దేశం వాటి ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలవనుందన్నారు. దీంతో వ్యవసాయ ఆర్థికవ్యవస్థ పరుగులు పెట్టనుందని పేర్కొన్నారు.

