మద్దతు ధరపై హైబ్రిడ్ జొన్న కొనుగోలు
మద్దతు ధరపై జొన్న సేకరణకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మార్క్ ఫెడ్‌ను నోడల్ ఏజెన్సీగా నియమించింది. 6.93 లక్షల క్వింటాళ్లను రైతుల నుంచి సేకరించనుంది. క్వింటాల్ రూ. 3,371 ల ధరపై ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు చేయాలని ఆదేశిస్తూ బుధవారం మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ-క్రాప్‌లో నమోదైన రైతుల నుంచి పంట కొంటారు. ఇందుకు రూ.40 కోట్లు మంజూరయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటికే పౌరసరఫరాల సంస్థ ద్వారా మానవ ఆహారానికి ఉపయోగపడే జొన్నలను సేకరిస్తున్నారు. హైబ్రిడ్ రకాల జొన్న తీసుకోక పోవడంతో వాటిని సాగు చేసిన రైతులకు మద్దతు ధర దక్కడం లేదు. తక్కువ ధరకే అమ్ముకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం వాటిని కూడా మద్దతు ధరపై సేకరించేందుకు అనుమతిచ్చింది.

