మంత్రి తుమ్మల నిర్మాణంలో ఉన్న ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ సందర్శన
తెలంగాణ రాష్ట్రంలో సిద్దిపేట జిల్లా నర్మెట్టలో నిర్మాణంలో ఉన్న ఆయిల్ పామ్ ప్యాక్టరీని మంత్రి పొన్నంతో కలిసి వ్యవసాయ శాఖా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సందర్శించారు. జూన్ రెండవ వారంలో క్రషింగ్ మొదలుపెట్టే విధంగా ప్రణాళిక చేసుకొని, దాని ప్రకారం రోజువారి ప్రగతిని జిల్లా కలెక్టర్‌కి సమర్పించవలసిందిగా ఆయిల్ ఫెడ్ అధికారులను మంత్రి తుమ్మల ఆదేశించారు.


