పంట వ్యర్థాలతో రోడ్లు
సాధారణంగా రైతులు పంట కోతల తర్వాత మిగిలిన గడ్డిని కాల్చేస్తుంటారు. దీంతో వాయు కాలుష్యం భారీగా పెరుగుతోంది. దేశ రాజధాని దిల్లీలో కాలుష్యం తీవ్రం కావటానికి ఇదీ ఒక కారణమే. సీఎసఐఆర్కు చెందిన దిల్లీలోని సెంట్రల్ రోడ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఆరఆరఐ), దేహ్రాదూన్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ)లు వరి గడ్డిని బయో బిటుమన్గా మార్ౘ్టంలో విజయం సాధించాయి. ఇందులో ముందుగా వరిగడ్డిని ఫైరోలిసిస్ ప్రక్రియ సాయంతో బయో ఆయిల్గా మారాస్తారు. అనంతరం దీన్ని శుద్ధి చేసి, బిటుమెన్ను తయారు చేస్తారు. మున్ముందు పత్తి వ్యర్థాల వంటి ఇతర పంట వ్యర్థాలతోనూ తారు తయారు చేయాలనీ భావిస్తున్నారు.

