పూత, పిందె ఏర్పాటులో సహాయపడే బయోడైనమిక్ ఎరువు ‘యారో (502)’
యారోపూలను మగ కణుజు మూత్రాశయంలో ఉంచి వేసవికాలంలో ఎండలో వ్రేలాడదీసి, రాబోయే శీతాకాలంలో సారవంతమైన భూమిలో పూడ్చి పెట్టాలి. ఇది పొటాషియం, సిలికా, సెలీనియం చైతన్యకారక బాక్టీరియాని ప్రేరేపించి గంధకం యితర పదార్థాలతో కలియడానికి సహాయపడుతుంది. పూత, పిందె సరిగ్గా ఏర్పడకపోతే ఈ బలహీనతను పోగొట్టి పూత, పిందె ఏర్పాటులో సహాయ పడుతుందీ బయోడైనమిక్ ఎరువు. మొక్కలను బలపరచి పురుగుల తాకిడి నుండి రక్షిస్తుంది. గ్రహాల రిథమ్స్‌తో భూమిని కలపడానికి సహాయపడుతుంది.




