ప్రొఫెసర్‌ జయశంకర్‌ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌కు చెందిన ఇండో క్లైమేట్‌ సెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ల మధ్య ఈరోజు ఒక అవగాహన ఒప్పందం కుదిరింది. రాజేంద్రనగర్‌లోని పిజెటిఏయు ఆవరణలోని అగ్రి హబ్‌ కార్యాలయంలో ఉపకులపతి డాక్టర్‌ ఆల్దాస్‌ జానయ్య సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్‌ డా. జి.ఇ.సిహెచ్‌. విద్యాసాగర్‌, ఇండో క్లైమేట్‌ సెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ప్రతినిధి రామచంద్రలు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేసి ఒప్పంద పత్రాలను పరస్పరం మార్చుకున్నారు. నేలలోని పోషకాల స్థాయిలని గుర్తించే సెన్సార్లు పై కలిసి పని చేసేందుకు ఈ ఒప్పందం తోడ్పడుతుంది. ఈ కార్యక్రమంలో విశ్వవిద్యాలయ పరిశోధన సంచాలకులు డాక్టర్‌ యం. బలరాం, సెంటర్‌ ఫర్‌ నేచురల్‌ రిసోర్సెస్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ సంచాలకులు డాక్టర్‌ కె.పి. వాణి, నేలల ఆరోగ్యం, యాజమాన్యం విభాగాధిపతి డాక్టర్‌ ఎ. మాధవి, తదితరులు పాల్గొన్నారు.