ప్రధాన మంత్రి పంటల బీమా పథకంకు రూ.44.06 కోట్లు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ.44.06 కోట్లు రబీలో ప్రధాన మంత్రి పంటల బీమా పథకం (పీఎంఎఫ్బీవై) అమలుకు విడుదల చేసింది. అడ్వాన్స్ ప్రీమియం కింద రాష్ట్ర వాటాగా ఈ మొత్తాన్ని ఎస్క్రోఖాతాలో డిపాజిట్ చేయాలని ఆదేశిస్తూ వ్యవసాయ శాఖ ఎక్స్అఫీషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

