పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డా|| మంథని జ్ఞాన ప్రకాశ్
తెలంగాణ రాష్ట్రంలోని పీవీ నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం ఉపకులపతిగా డా|| మంథని జ్ఞాన ప్రకాశ్ నియమితులయ్యారు. వీరు పదవీ బాధ్యతలు చేపట్టినప్పటినుంచి మూడు సంవత్సరాలపాటు ఈ పదవిలో కొనసాగుతారు. డా. జ్ఞాన ప్రకాశ్ పశువైద్య విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు, రిజిస్ట్రార్, కంప్ట్రోలర్గా పలు హోదాల్లో సేవలు అందించారు. రైతునేస్తం వీరికి అభినందనలు తెలియచేస్తుంది.

