పాడి రైతులకు మెరుగైన సేవలందిస్తాం
పశుసంవర్థకశాఖ కొత్త డైరెక్టర్ దామోదర్‌నాయుడు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో పశుపోషణ లాభదాయకంగా చేయడానికి చర్యలు తీసుకుంటామని పశుసంవర్థక శాఖ నూతన డైరెక్టర్ టి. దామోదర్‌నాయుడు చెప్పారు. విజయవాడలోని ప్రధాన కార్యాలయంలో ఆయన గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా దామోదర్‌నాయుడు మాట్లాడుతూ ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా పాడి రైతులకు మెరుగైన సేవలు అందిస్తామని చెప్పారు.

