పంటవ్యర్థాలు దహనం చేయని రైతులకు నగదు ప్రోత్సాహం
ఉత్తరాది రాష్ట్రాల్లో రైతులు పంట వ్యర్థాలను (వరిగడ్డి) పొలాల్లోనే కాల్చడం వలన ఉత్పన్నమయ్యే పలు రకాల సమస్యల పరిష్కారానికి పంజాబ్లోని బర్నాలా జిల్లా అధికారులు చక్కటి యోచన చేశారు. పంట వ్యర్థాలను దహనం చేయని రైతులను ప్రోత్సహించడానికి రూ.7 లక్షల కేటాయింపుతో ‘లక్కీ డ్రా’ పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి వారం 25 మంది రైతులను విజేతలుగా ప్రకటించి నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరిస్తారు. ప్రథమస్థానంలో నిలిచిన రైతుకు రూ.20,000, రెండో స్థానానికి రూ.15,000, మూడోస్థానానికి రూ. 10,000 అందజేస్తారు. మరో 22 మంది రైతులకు రూ.2,500 చొప్పున ఇస్తారు. ఈ పథకాన్ని ప్రారంభించిన బర్నాలా డిప్యూటీ కమీషనరు టి. బెనిత్ మొదటివారం విజేతలు 25 మందిని నగదు బహుమతులు, ప్రశంసా పత్రాలతో సత్కరించారు.

