నష్టపోయిన ప్రతిరైతుకు పరిహారం
భారీవర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రతిరైతుకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గనులు, భూగర్భ వనరులు, ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. మచిలీపట్నం నియోజకవర్గంలో వర్షాల కారణంగా ముంపుకు గురైన పంటలను మంత్రి పరిశీలించారు. పంట నష్టపోయిన రైతులతో మాట్లాడి, ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ అధిక వర్షాల కారణంగా వ్యవసాయ, ఆక్వా రంగాలకు తీవ్ర నష్టం జరిగిందని ఈనెల 10లోగా పంట నష్టం లెక్కించి, అంచనాలు రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారని మంత్రి అన్నారు. ఈ క్రాప్‌తో సంబంధం లేకుండా పంట నష్టం జరిగిన ప్రతిరైతును ఆదుకుంటామని మంత్రి అన్నారు.

