సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్ అమలుపై కమిటీ
సూక్ష్మసేద్యంలో ఆటోమేషన్ అమలు, ధర నిర్ణయం, వాటి విధివిధానాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఈ మేరకు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి ఉద్యానవన డైరెక్టర్ ఛైర్మన్‌గా, రాష్ట్ర సూక్ష్మసేద్య అధికారి కన్వీనర్‌గా వ్యవహరిస్తారని పేర్కొంది. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి ఓ శాస్త్రవేత్తతో పాటు వివిధ సంస్థల నుంచి మరో నలుగురు సభ్యులుగా కొనసాగుతారని తెలిపింది.

