ఔషధ మొక్క…. అనాస
అనాస ఒక మీటరు వరకు ఎత్తు పెరిగే బహువార్షిక మొక్క. కాండం దృఢంగా ఉండి, ఆకులు పొడవుగా, ముళ్ళు కలిగి ఉంటాయి. పండ్లు ఎరుపు, పసుపు మిశ్రమ రంగు కలిగి, రసంతో నిండి ఆకర్షణీయంగా ఉంటాయి. దీనిని పిలకమొక్కలు, క్రౌన్స్ మరియు స్లిప్స్ ద్వారా వ్యాప్తి చేస్తారు.
సాధారణ నామం : పైనాపిల్ శాస్త్రీయ నామం : అనానాస్ కామోసస్ కుటుంబం: అనోనేసి
ఉపయోగాలు : ఔషధరంగంలో …
- అనాస పండ్లు మరియు ఆకులు ఔషధగుణాలు కలిగి ఉంటాయి. అనాస పండులో “బ్రోమోలిన” అనే ప్రోటీన్‌ని విడగొట్టే ఎంజైమ్ ఉంటుంది. ఇది జీర్ణశక్తిని బాగా పెంపొందిస్తుంది.
- అనాస పండ్లలో ఎక్కువగా విటమిన్ ‘ఎ’ మరియు ‘సి’ లభిస్తాయి.
- పక్వానికి రాని పండు జీర్ణశక్తిని పెంచుతుంది. కడుపునొప్పిని తగ్గించి, ఆకలిని పెంచుతుంది.
- ఇది మూత్రకోశవ్యాధులకు మంచి ఔషధం, బాగా పండిన పండు చలవ చేస్తుంది.
- దీనిలోగల అధిక పీచు పదార్థం మలబద్ధకాన్ని తగ్గిస్తుంది. పండ్లరసం జీర్ణకోశ వ్యాధుల చికిత్సకు ఉపయోగపడటమే గాక మూత్రమును కూడా సులువుగా జారీ చేస్తుంది.
- ఆకులు స్త్రీలలో ఋతుక్రమాన్ని క్రమబద్ధం చేస్తాయి. గుండె జబ్బులు, జ్వరం, కోరింత దగ్గు నివారణలో ఉపయోగపడుతుంది. దీనిని క్రిమిసంహారిణిగా కూడా ఉపయోగిస్తారు.
వ్యవసాయరంగంలో :
- ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువగా విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, తూర్పుగోదావరి జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాలలో వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారు.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి


