ఆర్గానిక్ పసుపు పంట పండించాలి
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచన
ఆర్గానిక్ పద్ధతిలో పసుపు పంటను పండించుటకు తగిన చర్యలు తీసుకోవాలని పసుపు బోర్డు సెక్రటరీ శ్రీమతి భవాని శ్రీ, ఐ.ఎ.ఎస్ గారికి తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. అత్యధిక కుర్క్‌మిన్ ఉండే పసుపు విత్తనాన్ని రైతులకు అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకోలని, అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా పసుపు పంటను పండించేందుకు రైతులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, పసుపు ఆధారిత ఉప ఉత్పత్తులను తయారుచేసే పరిశ్రమలను ప్రోత్సహించాలని మంత్రి తుమ్మల అన్నారు.


