తెలంగాణాలో ధాన్యం కొనుగోలు ఊపందుకుంది
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా అన్ని జిల్లాల్లో వరి కోతలు ముమ్మరం అయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం భారీగా వస్తోంది. శుక్రవారం నాటికి 35.96 లక్షల టన్నులు కొనుగోళ్లు జరిగాయి. మద్దతు ధరతో పాటు బోనస్ కలిపి రూ. 6,688.63 కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది. 10,434 రెవెన్యూ గ్రామాలు ఉండగా.. 8,465 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని పౌరసరఫరాల సంస్థ లక్ష్యంగా పెట్టుకోగా, 8,361 కేంద్రాలను ప్రారంభించారు. దొడ్డు రకం 22.86 లక్షల టన్నులు, సన్నాలు 18.66 కలిపి మొత్తం 41.52 లక్షల టన్నులు కేంద్రాలకు రాగా, 35.96 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. ఇందులో 35.39 లక్షల టన్నులు మిల్లులకు తరలించారు. గోదాముల్లో 2,750 టన్నులు నిల్వ చేశారు. 54,241 టన్నుల వడ్లను కేంద్రాల నుంచి మిల్లులకు తరలించాల్సి ఉంది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్.. అక్టోబరులో ధాన్యం కొను గోళ్ల ప్రక్రియలో జాప్యమైంది. సీఎం రేవంత్రెడ్డి ఈ అంశంపై దృష్టి పెట్టి.. ఉన్నతాధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దీంతో నవంబరులో కొనుగోళ్లు వేగవంతమయ్యాయి.

