తెలంగాణలో 141 లక్షల క్వింటాళ్ల పత్తి కొనుగోళ్లు
కనీస మద్దతు ధర కింద రూ.11,800 కోట్ల విలువైన 141 లక్షల క్వింటాళ్ల పత్తి తెలంగాణ నుంచి 2025-26 సీజన్లో కొనుగోలు చేసినట్లు కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరీటా తెలిపారు. మంగళవారం లోక్సభలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్ౘ్ారు. సీసీఐ రాష్ట్రవ్యాప్తంగా 30 జిల్లాల్లో 122 కేంద్రాల ద్వారా 8.60 లక్షల మంది రైతుల నుంచి నేరుగా కొనుగోళ్లు చేసినట్లు చెప్పారు. 2024-25లో పత్తి ఉత్పత్తిలో తెలంగాణ దేశంలో రెండోస్థానంలో నిలిచినట్లు పేర్కొన్నారు

