తక్కువ ఖర్చుతో రైతులకు సాంకేతిక సహకారం
మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రైతులకు తక్కువ ఖర్చుతో అవసరమైన సాంకేతిక సహకారం, మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పించేందుకు డిజిటల్ గ్రీన్ సంస్థతో ఒప్పందం చేసుకోనున్నట్లు సెర్ప్ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోని కార్యాలయంలో ఆయన బుధవారం డిజిటల్ గ్రీన్ సంస్థ ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారి కార్యకలాపాలను సంస్థ ప్రతినిధులు వివరించారు.

