ఆంధ్రప్రదేశ్‌కి పండ్లు, చేపల ఉత్పత్తిలో మొదటి స్థానం
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా 2024-25 ఆర్థిక సంవత్సరం గణాంకాలు విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 1.93 కోట్ల టన్నుల పండ్లు ఉత్పత్తి చేస్తూ దేశంలోనే ప్రథమస్థానాన్ని దక్కించుకుంది. తర్వాత మహారాష్ట్ర 1.68 కోట్ల టన్నుల ఉత్పత్తితో రెండోస్థానంలో ఉంది. మధ్యప్రదేశ్ 1.02 కోట్ల టన్నుల ఉత్పత్తితో మూడోస్థానంలో ఉంది. 8.07 లక్షల హెక్టార్లలో పండ్లతోటలు సాగు చేస్తూ దేశంలో రెండోస్థానంలో ఏపీ ఉండగా 8.96 లక్షల హెక్టార్లలో సాగు చేస్తూ మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంది. చేపల ఉత్పత్తిలో కూడా దేశంలోనే మొదటి స్థానంలో ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 51.58 లక్షల టన్నుల చేపల ఉత్పత్తి జరుగుతుంది. ఆ తర్వాత పశ్చిమబెంగాల్ 22 లక్షల టన్నులతో రెండోస్థానంలో, ఉత్తర్‌ప్రదేశ్ 11.60 లక్షల టన్నులతో మూడోస్థానంలో ఉన్నాయి.
*రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.15.93 లక్షల కోట్లు* ప్రస్తుత ధరల వద్ద రాష్ట్ర స్థూల ఉత్పత్తి 2024-25లో రూ.15.93 లక్షల కోట్లుగా రిజర్వు బ్యాంకు పేర్కొంది. స్థిరధరల వద్ద రూ.8.65 లక్షల కోట్లుగా తేల్చింది. సగటున రాష్ట్ర స్థూల ఉత్పత్తి రూ.2,66,240 (ప్రస్తుత ధరల్లో), రూ. 1,41,609 (స్థిర ధరల వద్ద) గా పేర్కొంది. సగటు రాష్ట్ర నికర ఉత్పత్తి ప్రస్తుత ధరల వద్ద రూ.14.22 లక్షల కోట్లు కాగా స్థిర ధరల వద్ద రూ.7.56 లక్షల కోట్లు బియ్యం ఉత్పత్తి 81.59 లక్షల టన్నులు, ఆహారధాన్యాల ఉత్పత్తి రాష్ట్రం మొత్తమ్మీద 1.17 కోట్ల టన్నులు రాష్ట్రవ్యాప్తంగా వరిసాగు 20.77 లక్షల హెక్టార్లు సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సాధనలో 74 మార్కులతో ఆంధ్రప్రదేశ్ పదో స్థానంలో ఉంది. తెలంగాణ కూడా ఇదే స్థానంలో నిలిచింది.
*సగటు జీవన కాలం 70 ఏళ్లు* ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో సగటు జీవనకాలం 70 ఏళ్లు. పురుషులు 68 ఏళ్లు జీవిస్తుండగా, మహిళలు ఐదేళ్లు ఎక్కువగా 73 ఏళ్లు జీవిస్తున్నారు. జాతీయ సగటు కూడా 70 ఏళ్లతో తెలుగు రాష్ట్రాలు సమంగా ఉన్నాయి. అత్యధిక జీవితకాలం ఉన్న జాబితాలో తెలుగు రాష్ట్రాలది 9వ

