మొక్కల ఎదుగుదలకు… చేప బెల్లం ద్రావణం
మొక్కల ఎదుగుదలకు నత్రజని చాలా అవసరం. దీనిమీద లక్షల కోట్ల రూపాయలు ప్రభుత్వాలు సబ్సిడీగా ఇస్తున్నాయి. ఇందుకోసం ఎటువంటి కృత్రిమ ఎరువులు అవసరం లేకుండా చేప బెల్లం ద్రావణాన్ని తయారుచేసి మొక్కలకు అందించవచ్చు. ఈ ద్రావణంలో పదమూడుశాతం పైగా ఎమైనో ఆసిడ్స్ వుంటాయి. పదిహేనురోజుల్లో ద్రావణం తయారు చేసుకోవచ్చు.
ఒక కిలో చేపలను ముక్కలుగా చేసి, 1కిలో బెల్లంతో కలిపి పదిహేను రోజులపాటు నిలువవుంచాలి. తయారైన ద్రావణాన్ని 1 లీటర్కు 1 మి.లీ. చొప్పున కలుపుకుని స్ప్రే చేసుకోవాలి. దీనిని నర్సరీ దశనుండి మొక్క ఎదిగే దశ వరకు ఇస్తే మంచి ఫలితాలు గమనించవచ్చు.


