బహుళ ప్రయోజనాలుగల ఔషధ మొక్క…. ఉల్లి
ఉల్లి ఒక ఏకదళ, ద్వైవార్షిక లేదా బహువార్షిక మొక్క అయినప్పటికీ, సాధారణంగా దీనిని ఏకవార్షిక మొక్కగా సాగు చేస్తారు. ఉల్లి మొక్క అనేక గొట్టంలాంటి నీలిఆకుపచ్చ రంగు నుండి ముదురు ఆకుపచ్చ రంగు ఆకులను కలిగి ఉంటుంది. మొక్క క్రింది భాగం చిన్న గడ్డ కలిగి ఉండి ఊరిన తర్వాత ఉల్లిగడ్డగా మారుతుంది. గడ్డలు కురచబడిన, భూమిలోపల అణచబడిన కాండముల చుట్టూ మెత్తని మార్పు చెందిన పొలుసులు (ఆకులు) కాండం చివర మధ్యలో ఉన్న మొగ్గను కప్పి ఉంచుతాయి. వసంతకాలంలో ఆకులు ఎండి చనిపోయి గడ్డ పైపొరలు ఎండి పెళుసుగా మారతాయి. ఉల్లి ప్రతి సంవత్సరం గడ్డలను, రెండు సంవత్సరాలకొకసారి గింజలను ఉత్పత్తి చేస్తుంది. పూలకాడ గట్టిగా, గొట్టంలా ఉండి మైనపు పొరతో 1 మీ. ఎత్తు పెరుగుతుంది. పూగుచ్ఛం గొడుగు ఆకారంలో గుండ్రంగా ఉంటుంది. పూలు తెల్లని రంగులో ఉంటాయి. కాయ ఒక కాప్సూల్. పునరుత్పత్తి విత్తనాల ద్వారా జరుగుతుంది.
సాధారణ నామం: ఆనియన్ శాస్త్రీయ నామం: అల్లియంసెపా కుటుంబం: అమారిల్లిడేసి
ఉపయోగాలు : ఔషధ రంగంలో ….
- ఉల్లి కాడలు, గడ్డలు, గింజలు ఔషధ గుణాలు కలిగి ఉంటాయి.
- ఉల్లి యాంటి ఆక్సిడెంట్, రోగనిరోధకశక్తి, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉండి అనేక వ్యాధుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
- ఉల్లిని ఊబకాయం కలిగి ఉన్న వారికి బరువు తగ్గించే చికిత్సలో ఉపయోగిస్తారు.ఆహారంగా ఉల్లి శరీరానికి అనేక పోషకాలనందిస్తుంది.
- ఔషధంగా ఉల్లి అధిక కొలెస్టరాల్, మధుమేహం, కీళ్ళ సమస్యలు, జీర్ణకోశ వ్యాధులు, గాల్ బ్లాడర్ వ్యాధులు, ఆకలి మందగించడం, అధిక రక్తపోటు, గొంతు నొప్పి, ఆస్త్మా, బ్రోంకైటిస్, దగ్గు, గ్యాస్ట్రిక్ సమస్యలు, కడుపులో నులిపురుగుల చికిత్సలో ఉపయోగపడుతుంది.
- ఉల్లిలో కీంప్‌ఫెరాల్, మిరిస్టిన్, క్వెర్సెటిన్, క్వెర్సిట్రిన్, అల్లెåల్‌సల్ఫైడ్ అనే రసాయనాలు ఉంటాయి. వీటిలో ముఖ్యమైనది క్వెర్సిటిన్ అనే ఫ్లేవనాయిడ్. ఇది మంచి యాంటిఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఇంకొక ముఖ్య రసాయనం, అల్లెåల్ సల్ఫైడ్, యాంటిఆక్సిడెంట్, యాంటి ఇన్‌ఫ్లమేటరి లక్షణాలు కలిగి ఉంటుంది.
- ఉల్లి యాంటి ఆక్సిడెంట్, యాంటిఇన్‌ఫ్లమేటరి, యాంటికొలెస్టరాల్, యాంటీహైపర్ సెన్సిటివ్, యాంటిక్యాన్సర్, యాంటిఆర్థ్రెåటిక్, యాంటిబాక్టీరియల్ లేదా యాంటిబయాటిక్, బ్రాంకోడైలేటర్, ఎక్స్‌పెక్టొరెంట్, యాంటిస్పాస్మోడిక్, యాంటిసెప్టిక్, కార్మినేటల్, పైబ్రినోలైటిక్, యాంథెల్మిటిక్, యాంటికోయాగ్యులెంట్ ఔషధ గుణాలు కలిగి ఉంది.
- ఉల్లి శరీరంపై మచ్చలు తొలగించడానికి, కాల్పులు, గాయాలు, కేశనష్టం, మధుమేహం, అధిక కొలెస్టరాల్, అధిక రక్తపోటు, ఆస్త్మా, సాధారణ జలుబు, పొడి దగ్గు, గొంతునొప్పి, బ్రాంక్రైటిస్, ఆకలి లేకపోవడం, కడుపులో కలవరం, కంటిచూపు, శుక్లాలు, గుండెనొప్పి వంటి సమస్యల నివారణలో ఉపయోగపడుతుంది.
వ్యవసాయరంగంలో …
- క్యాబేజి పంటలో ఉల్లి, వెల్లుల్లి పంటలను పురుగు నివారణ అంతర పంటలుగా సాగు చేస్తారు. ఈ అంతర పంటలు అల్లిసిన్ ఉత్పత్తి ద్వారా పురుగులను వికర్షిస్తాయి. వీటి వేర్ల నుండి స్రవించే ద్రవాలు వాటి వాసన ద్వారా పురుగులను వికర్షిస్తాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి క్షేత్రంలో డైమండ్ బ్యాక్‌మాత్, ప్లూటెల్లాక్ౙెåలోస్టెల్లా లార్వాలు, ప్యూపాలు చాలా తక్కువగా ఉన్నాయి. అంతర పంటలు సాగు చేసిన క్యాబేజి క్షేత్రంలో అధిక సంఖ్యలో క్యాబేజి మొక్కలు బతికి ఉన్నాయి. ఉల్లి, వెల్లుల్లి యాంటిఫీడెంట్ చర్య ద్వారా ఆకుతినే పురుగులను పారదోలాయి. అంతర పంటలు వేసిన క్యాబేజి పంటలో దిగుబడులు కూడా గణనీయంగా పెరిగాయి. సన్న, చిన్న కారు రైతులు క్యాబేజిలో ఉల్లి, వెల్లుల్లిలను అంతర పంటలుగా సాగు చేసి అధిక దిగుబడులు, అధిక ఆదాయం పొందవచ్చని ఫలితాలు వెల్లడించాయి (దేబ్ర అండ్ మిషెక్, 2014).
- పైన్ మొక్కల మీద అల్లం, వెల్లుల్లి ద్రావణాలను పిచికారి చేసి మిడతలను వికర్షింపజేశారు. మిడతలు అల్లం, వెల్లుల్లి ద్రావణాల వాసనను అసహ్యించుకుని దూరంగా పారిపోయాయి.
- ఉల్లి, వెల్లుల్లి, అల్లం ద్రావణాలు ఆల్టర్నేరియా సొలాని శిలీంద్ర పెరుగుదల నరికట్టాయి. అందువలన వీటిని సహజ శిలీంద్ర నాశినులుగా ఉపయోగించవచ్చు. (ముడ్యివ, అతని అనుచరులు, 2016).
- ఉల్లి ద్రావణం నుండి తయారు చేసిన సిల్వర్ నానోపార్టికల్స్ బాసిల్లస్ సబ్‌టైలిస్, క్లెబ్సియెల్లాన్యుమోనియే, ఎస్కరిచియాకోలి, బాసిల్లస్ ఎంటరోబాక్టర్ (బాక్టీరియా), ఆస్పర్ౙిల్లస్ నైగర్, ఆస్పర్ౙిల్లస్ ఫ్లేవస్, ఆస్పర్ౙిల్లస్ ఓక్రేసియస్ (శిలీంద్రాలు)లపై గణనీయమైన యాంటిబాక్టీరియల్, యాంటిఫంగల్ చర్యలను ప్రదర్శించాయి (బాలమణికందన్, అతని అనుచరులు, 2015).
- ఉల్లిగడ్డను సన్నగా తరిగి రెండు చెంచాల నూనెలో ఒక రోజు నానబెట్టాలి. తర్వాతి -ఒక అర లీటరు సబ్బు నీటిలో కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 1:20 నిష్పత్తిలో నీటిలో కలిపి పిచికారి చేయాలి.
- నివారించబడే తెగుళ్ళు : సెర్కోస్పొరా ఆకుబూజు, ఆకుమచ్చ, ఎర్లీబ్లెåట్, కప్పకన్ను తెగులు, కొల్లెటోట్రైకం ఆకుమచ్చ, ఆంత్రాక్నోస్, కాయకుళ్ళు, స్మడ్ౙి, కర్వులేరియా ఆకుమచ్చ, ఆకుమాడు
- ఎరుపు రంగు పొరలున్న ఉల్లిపాయలలో కెటచాల్ అనే ఫినాలిక్ కాంపౌండ్ స్మడ్ౙి తెగులు కలిగించే శిలీంద్రం, కొల్లెటోట్రైకం సిర్సినాన్స్, సోకకుండా వ్యాది నిరోధక శక్తిని సమకూరుస్తుంది (లింక్ అండ్ వాకర్, 1933).
- ఉల్లి బోట్రైటిస్ సినరియా ఆశించినపుడు సైక్లోపెంటోన్‌క్లాస్‌కి చెందిన సిబ్యులిన్స్ అనే ఫైటోఎలక్సిన్‌ని ఉత్పత్తి చేసి శిలీంద్రబీజం మొలకెత్తడాన్ని, జెర్మ్‌ట్యూబ్ పెరగడాన్ని అరికడుతుంది (డిమత్రీన్, అతని అనుచరులు, 1990).
- కంద దుంప నిల్వ సమయంలో ఆశించే మాత్ డాసిసెస్ రుగోసెల్లాని మిరప (కాప్సికం యాన్యువమ్, కాప్సికం ఫ్రూటెసెన్స్) పొడులు అతి సమర్ధవంతంగా 24 గంటలలోపే 100% మాత్ పురుగులను చంపాయి. సిడియంగ్వినీన్స్, ఉల్లి, వెల్లుల్లి పొడులనుపయోగించిన 3 రోజులలో సమర్దవంతంగా నివారించాయి (అషామొ, 2010).
- ఉల్లిని అన్ని పురుగుల (పిండినల్లితో సహా)ను సమర్ధవంతంగా అరికట్టి, మొక్కలలో రోగనిరోధక శక్తిని పెంచి, దిగుబడులను అదికం చేసే గోమూత్ర జంతునాశక ద్రావణం తయారీలో ఉపయోగిస్తారు. దీనిని తయారు చేయడానికి అవసరమైన పదార్థాలన్నీ స్థానికంగా లభిస్తాయి. దీని తయారీ విధానం సులభం. అంతేగాక ఇది పర్యావరణహిత పద్దతి. కూరగాయల పంటలలో దీనినుపయోగిస్తే కూరగాయల రుచి, వాసన పెరుగుతాయి.
- ఉల్లిలో ఉండే ఆల్కలాయిడ్లు చాలా రకాల తెగుళ్ళ నియంత్రణలో ఉపయోగపడతాయి. ఉల్లి కషాయం వ్యాదికారకాల పెరుగుదలను నిలిపివేయడంలోను, తెగులు కారకాల బీజాలు మొలకెత్తడాన్ని నియంత్రించడంలోను ఉపయోగపడుతుంది.
రైతునేస్తం ప్రచురణ ‘ఔషధ వేదం’ పుస్తకం కొరకు ఫోన్: 9676797777కు సంప్రదించండి


