ఉల్లిగడ్డలతో మనము రకరకాల వంటలు చేసుకోవచ్చు.

ఇది ఉల్లిగడ్డ ముక్కలతో చేసేది. నోరు బాలేనప్పుడు, చట్నీలు చేసే టైం లేనప్పుడు, దోసెల్లోకి, జొన్నరొట్టెల్లోకి, చపాతీల్లోకి బాగుంటది. చాలా సింపుల్‌గా ఒక నిమిషంలో అయిపోతది.

ఎండాకాలంలో ఎంత ఎక్కువ ఉల్లిగడ్డ తింటే అంత మంచిది. చలువ చేస్తుంది, కాబట్టి వీలైనంత మటుకు ఉల్లిగడ్డను మన ఆహారంలో చేర్చాలి.

కావలసినవి: 2 ఉల్లిగడ్డలు, కొంచెం కారం, కొంచెం ఉప్పు, నూనె… అంతే ! జీలకర్ర, ఎల్లిగడ్డ అవసరం లేదు.
ఉల్లిగడ్డను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని, దాంట్లో మనం తినగలిగినంత కారం, కొంచెం ఉప్పు, పచ్చి నూనె కలపాలి. అన్నింటిని మంచిగా కలిపి తినేయడమే.

దీంట్లో నూనెకు బదులుగా నెయ్యి వాడదామని అనుకునేరు, అస్సలు బాగుండదు. కాకపోతే మనం తినే దోసెల మీద లేదా రొట్టెల మీద కొంచెం వెన్నపూస పెట్టుకుంటే బాగుంటది.
అప్పటికప్పుడు చేసుకోవడానికి బాగుంటది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి