చాలా సింపుల్ వంటకం.

ఉల్లిగడ్డ కారం లేదా ఉల్లిగడ్డ పచ్చడి

రెండు ఉల్లిగడ్డలు, ఒక ఎల్లిపాయ (వెల్లుల్లి). కొంచెం జీలకర్ర, ఎండుకారంతో చేస్తే, ఇది ఉల్లిగడ్డ కారం అయితది.

ముందుగా ఉల్లిగడ్డలను పొట్టు తీసి ముక్కలుగా కోసి, అందులో పొట్టు తీసిన ఎల్లిపాయలను వేసి, తగినంత కారం, ఉప్పు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. ఎండు కారానికి బదులుగా, పచ్చిమిర్చి కూడా వాడవచ్చు. అవసరమైన వారు పోపు పెట్టుకోవచ్చు. పోపు లేకపోయినా రుచికరంగానే ఉంటుంది.
ఒంట్లో నలతగా ఉన్నప్పుడు, ఏది తినాలని అనిపియ్యనప్పుడు, ఉల్లిగడ్డ కారం చాలా బాగుంటది. ఇంట్లో కూరగాయ లేనప్పుడు, రెండు నిమిషాల్లో అయిపోతుంది. పచ్చి నూనె కలుపుకొని తిన్నా బాగుంటుంది.
ఈ కారాన్ని పేలాలలో, సలాడ్లలో, అన్నంలో, రొట్టెల్లో, దేంట్లో అయినా కలిపి తినొచ్చు. అన్నిటిలోకి కలిసిపోతుంది.

రచన: శ్రీమతి జిట్టా జ్యోతిరెడ్డి

రైతునేస్తం ప్రచురణ ‘వండని వంటలు’ పుస్తకం కొరకు Ph: 9676797777కు సంప్రదించండి