అమెరికాలోని కాన్సస్‌ స్టేట్‌ యూనివర్సిటీతో తెలంగాణ వ్యవసాయ, ఉద్యాన విశ్వవిద్యాలయాలు బుధవారం వేర్వేరుగా అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఉపకులపతి అల్దాస్‌ జానయ్య, కాన్సస్‌ వర్సిటీ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్‌లు ఒప్పందపత్రాలు మార్చుకున్నారు. ఈ ఒప్పందం… డిజిటల్‌ వ్యవసాయ కేంద్రం ఏర్పాటుకు, సహజ వనరులు, పర్యావరణంపై పరిశోధనకు, ఏఐతో కూడిన సాంకేతిక పరిజ్ఞానాభివృద్ధికి సహకరిస్తుందని జానయ్య తెలిపారు. అనంతరం తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయంలో… వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, కాన్సస్‌ విశ్వవిద్యాలయ పంటల పరిశోధన సంచాలకుడు వి. వరప్రసాద్‌లు మరో ఒప్పందం కుదుర్చుకున్నారు.