కూరగాయపంటలకు తెగుళ్ళ బెడద ఎక్కువగా ఉంటుంది
కూరగాయ పంటలకు తెగుళ్ల బెడద ఎక్కువగా ఉంటోందని.. రైతులు అప్రమత్తంగా ఉంటూ.. వాటి నివారణకు కృషి చేయాలని ఉద్యాన శాస్త్రవేత్తలు సూచించారు. హైదరాబాద్‌లోని కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయ కూరగాయల పరిశోధన కేంద్రంలో ‘అఖిల భారత సమన్వయ పథకం’ 44వ వార్షిక సమావేశం ఆదివారం ముగిసింది. ఈ సందర్భంగా ఉద్యాన వర్సిటీ వీసీ దండా రాజిరెడ్డి, ఐకార్ ఏడీజీ సుధాకర్ పాండే, వారణాసి భారతీయ కూరగాయల పరిశోధన సంస్థ డైరెక్టర్ డాక్టర్ రాజేశ్‌కుమార్, బెంగళూరులోని ఐఐహెచఆర్ డైరెక్టర్ టీకే బెహరా, ఎన్‌బీపీజీఆర్ డైరెక్టర్ జీపీ సింగ్, ఎనఐఆర్‌సీఏ డైరెక్టర్ శేషు మాధవ్, మాజీ వీసీ లావాండే, ఇతర శాస్త్రవేత్తలు పలు సూచనలు చేశారు.


