ఈనెల 13 వరకు హైదరాబాద్లో ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు
హైదరాబాద్లోని హెచ్ఐసీసీలో ప్రపంచ ఆక్వాకల్చర్ సదస్సు-2025 సోమవారం లాంఛనంగా ప్రారంభమైంది. ప్రపంచ ఆక్వాకల్చర్ సొసైటీ, భారత వ్యవసాయ పరిశోధన మండలి, జాతీయ అభివృద్ధి మండలి, తెలంగాణ పశువైద్య విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 13 వరకు నిర్వహించే ఈ సదస్సులో 20కి పైగా దేశాలు పాల్గొంటున్నాయి. ప్రపంచ జనాభాకు అనుగుణంగా మత్స్యరంగం, ఆక్వాకల్చర్ విస్తరణ లక్ష్యంతో నిర్వహించే ఈ సదస్సులో ‘దేశంలో నీలి విప్లవంతో ఆక్వా ఎగుమతుల వృద్ధి’ అంశంపై మంగళవారం నుంచి 13వ తేదీ వరకు చర్చాగోష్ఠులు జరగనున్నాయి.

