ఆయిల్‌పామ్ రైతులకు స్థిర ధరలు అందించేలా చర్యలు
వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు
ఆయిల్‌పామ్ రైతులకు స్థిరమైన ధరలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఆయిల్‌పామ్ రైతులు, కంపెనీల యాజమాన్యాలు, ఆయిల్‌ఫెడ్, ఉద్యానశాఖ అధికారులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయిల్‌పామ్ సాగు విస్తరణ పైన చర్చించారు.ఆయిల్‌పామ్ ధరలపై ముఖ్యమంత్రి చంద్రబాబుతో చర్చించనున్నట్లు తెలిపారు. సమావేశంలో సరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు, అనపర్తి ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్, డైరెక్టర్ ఢిల్లీరావు, ఉద్యానశాఖ కమీషనర్ శ్రీనివాసులు పాల్గొన్నారు.

