ఆంధ్రప్రదేశ్లో పంట నష్టం జాబితాలపై గ్రామస్థాయిలో సామాజిక తనిఖీ
గ్రామస్థాయిలో పంటనష్టం నమోదు జాబితాలను సామాజిక తనిఖీకి సిద్ధంగా ఉంచాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయశాఖ డైరెక్టర్ మనజీర్ జిలానీ మండల వ్యవసాయ అధికారుల్ని ఆదేశించారు. పంట నష్టపోయిన ప్రతి రైతు వివరాలు జాబితాలో ఉండాలని, వారి నుంచి వినతులు తీసుకోవాలని సూచించారు.
