ఆంధ్రప్రదేశ్లో ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు ఏర్పాటు
రాష్ట్రస్థాయి ఆహార నాణ్యత పరీక్షా కేంద్రాలు విశాఖ, గుంటూరు, తిరుమల, తిరుపతి, కర్నూలులో ఏర్పాటు చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియాతో కలిసి వీటిని అందుబాటులోకి తెస్తున్నట్లు పేర్కొన్నారు. ల్యాబొరేటరీల నిర్మాణం, ఆధునికీకరణకు సుమారు రూ.100 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. తిరుమల, విశాఖపట్నంలలోని రాష్ట్రస్థాయి లేబొరేటరీల్లో ఆహార నమూనాల పరీక్షలు నెల రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఒంగోలు, ఏలూరుల్లోని ప్రజా రోగ్య ప్రయోగశాలలలో రూ.13 కోట్లతో ఆధునిక పరికరాల కొనుగోలుకు అనుమతిచ్చినట్లు వివరించారు.

