ప్రియ నేస్తం, సుస్థిర వ్యవసాయం, రైతుల సంక్షేమం
ఆరోగ్య జీవనం లక్ష్యంగా రైతు నేస్తం పనిచేస్తోంది.
రైతులని సుశిక్షితులని చేసే క్రతువులో భాగంగా సేంద్రియ, సహజ సేద్య విధానాలు, లాభదాయక పంటల సాగుపై గత నాలుగేళ్లుగా ప్రతి ఆదివారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తోంది.
ఏప్రిల్ 19న 200 వారం పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా…
ఏప్రిల్ 25, 26, 27 తేదీల్లో గుంటూరులోని శ్రీ పాటిబండ్ల సీతారామయ్య ఉన్నత పాఠశాలలో రాష్ట్రస్థాయి సేంద్రియ ఉత్పత్తుల మేళా నిర్వహించ తలపెట్టింది.
సహజ ఉత్పత్తుల ప్రదర్శన-విక్రయం, రైతు అవగాహన సదస్సులు, ఆహార ఫలహారశాలలు, సాంస్కృతిక కార్యక్రమాలు వంటివి సేంద్రియ ప్రదర్శన ప్రత్యేకాంశాలు.
ఈ విశేష సేంద్రియ ఉత్పత్తుల మేళాని మీ ఉత్పత్తుల పరిచయానికి చక్కని వేదికగా ఉపయోగించుకుంటారని ఆహ్వానిస్తున్నాం.
స్టాళ్ల నమోదు, ఇతర వివరాల కోసం 98493 12629, 70939 73999 నంబర్లలో సంప్రదించగలరు.
ధన్యవాదాలు.
