జీడిమెట్లలోని సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు, రాష్ట్ర ఉద్యానశాఖ ఆధ్వర్యంలో ‘కూరగాయల సాగు- మెలకువలు’ అంశంపై శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఉద్యాన పంటలను సాగు చేస్తే.. మెరుగైన ఆదాయం వస్తుందని తెలంగాణా రాష్ట్ర ఉద్యానశాఖ జాయింట్ డైరెక్టర్ రామలక్ష్మి తెలిపారు. ప్రస్తుతమిక్కడ శిక్షణ పొందినవారు.. మట్టి లేకుండానే కూరగాయల సాగు, బిందు సేద్యంతోపాటు నీటిలో కరిగే ఎరువుల యాజమాన్య పద్ధతులపైనా సమగ్ర అవగాహన పొందారని తెలిపారు. కూరగాయల పెంపకంలో నిపుణులైన ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ప్రాజెక్టు ఉన్నతాధికారులు రాబిన్ స్టీన్, డేనియల్ హదాబ్, మేడ్చల్ జిల్లా ఉద్యాన అధికారి శ్రీధం, 12 రాష్ట్రాల నుంచి 40 మంది అధికారులు పాల్గొన్నారు.

19 Dec, 2025
