* రైతు కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 22 సీట్లు
.* రైతు కూలీల కోటాలో ఖాళీగా ఉన్న సుమారు 40 సీట్లకి 28వ తేదీన కౌన్సిలింగ్ 2025-26 విద్యా సంవత్సరానికి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం, శ్రీ కొండా లక్ష్మణ్ ఉద్యాన విశ్వవిద్యాలయంలోని వివిధ రెగ్యులర్ డిగ్రీ, స్పెషల్ కోటా యూజీ కోర్సులలో ప్రవేశాలకు చివరి థ కౌన్సిలింగ్ ఈనెల 28వ తేదీ (శుక్రవారం) ఉదయం 10 గంటలకు నిర్వహించనున్నట్లు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం తెలిపింది. రైతు కోటాలో సుమారు 22 సీట్లు, రైతు కూలీల కోటాలో సుమారు 40 సీట్లు ఖాళీగా ఉన్నాయని వాటిని ఈ కౌన్సిలింగ్ ద్వారానే భర్తీ చేయనున్నట్లు విశ్వవిద్యాలయం పేర్కొంది. తల్లిదండ్రులు, విద్యార్థులు కేటగిరీల వారీగా సీట్ల వివరాలని వెబ్‌సైట్‌లో చూసి కౌన్సిలింగ్‌కి హాజరు కావాల్సిందిగా విశ్వవిద్యాలయం సూచించింది. అదేవిధంగా నవంబర్ 29న (శనివారం) మధ్యాహ్నం రెండు గంటలకు ఎన్‌ఆర్‌ఐ / ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కోటా బీఎస్సీ (ఆనర్స్) అగ్రికల్చర్, బీటెక్ (ఫుడ్ టెక్నాలజీ), బిటెక్ (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), బిఎస్సీ (ఆనర్స్), కమ్యూనిటీ సైన్స్ కోర్సుల్లో సీట్ల భర్తీకి వాక్-ఇన్-కౌన్సిలింగ్ జరగనుందని విశ్వవిద్యాలయం తెలిపింది. ఈ రెండు కౌన్సిలింగ్‌లు రాజేంద్రనగర్‌లోని విశ్వవిద్యాలయం ఆడిటోరియంలోనే జరగనున్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు అన్ని ఒరిజినల్ ధ్రువపత్రాలు, వెబ్‌సైట్‌లో పేర్కొన్న రుసుముతో కౌన్సిలింగ్‌కు హాజరుకావాలనీ, పూర్తి వివరాలు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్ *www.pjtau.edu.in* లో చూడవచ్చు.

